రాకఫెల్లర్ నిరాడంబరత
- Akhand Jyoti Magazine
- Aug 14, 2021
- 1 min read

విశ్వంలోని అత్యధిక ధనవంతులుగా నిర్ధారించబడిన వారిలో రాక్ ఫెల్లర్ ఒకరు. ఈయన తన కఠోర పరిశ్రమ, నాయకత్వ లక్షణాల ద్వారా ఉన్నత స్థితి చేరుకున్నాడు. వంశపారపర్యంగా వచ్చినదేమీ లేదు. ఆయన తల్లి చిన్న కోళ్ళఫారం నడిపేది. ఆమె పనిలో సహాయపడుతూ ఉండటంవల్ల ఆయనకు నెలకు ఒక డాలర్ కూలి లభించేది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, చెమటోడ్చి పనిచేసి, నూనె వ్యాపారం చేసి కోటీశ్వరుడు అయ్యాడు, అనేక సేవా సంస్థలకు పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చేవాడు. కానీ ఈయన గొప్పతనం ఏమిటంటే సదా వినమ్రుడై, మితవ్యయంతో సాదాజీవనం గడుపుతుండేవాడు.
పరమార్థ పరులైన ఇటువంటి వ్యక్తుల వలన గోరింటాకు రుబ్బినవారి చేతులు పండినట్లే అందరి మేలుకోరుతూ ఆయన గొప్పవాడయాడు. ప్రపంచానికి అనేక రకాలైన సేవలు అందించాడు.
- ప్రజాపురాణం నుండి
యుగశక్తి గాయత్రి - Sept 2010
Comments