top of page
Post: Blog2_Post

క్షుద్రత దహించకుండా జాగ్రత్తపడండి

నేడు ప్రపంచమంతా క్షుద్రమైన మనోవృత్తులు రాజ్యం చేస్తున్నాయి. ఈర్ష్య, బాధలతో రగులుతున్న మనుషులు మానసికంగా తమని తాము నాశనం చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా, తమ మంట చల్లార్చుకోవడానికి ఎన్నో కుతంత్రాలు పన్నుతారు. దానికోసం చాల శక్తిని వినియోగిస్తారు. కానీ అదే శక్తిని వారు ఉపయోగకరమైన వాటికి వినియోగిస్తే ఎంతో ఉద్ధరింపబడతారు. చాలా మంది ఈ దుష్ప్రవృత్తులను తృప్తి పరచడానికి తమ సమయాన్ని, మనోబలాన్ని ఉపాయాగిస్తారు. దాని బదులు ఇతరుల సహాయానికి, ఆత్మకళ్యాణానికి వాటిని ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈర్ష్య, బాధల గురించి ఎంత గంభీరంగా ఆలోచిస్తే, అవి అంత నిరర్ధకమైనవి అని తెలుస్తూ ఉంటుంది.

ద్వేష ప్రవృత్తులను వదులుకుని మనిషి తనలో సత్ప్రవృత్తులను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే గనక అతని జీవితం నేటితో పోలిస్తే రేపు మరింత అందంగా ఉంటుంది. దృష్టికోణం మారితే దృశ్యం మారుతుంది. పడవ దారి మళ్లిస్తే, తీరం కూడా మారుతుంది. మనల్ని మనం ఈ విధంగానే మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మంచి పనికి ప్రతిరోజూ మంచి రోజే, ఎంత వయసైనా సరైనదే. ముసలి వారు, కాటికి కాలు జాపుకున్నవారు కూడా తమని తాము సరిదిద్దుకుంటే ఆశించిన విజయం తప్పకుండా పొందగలరు. అలాంటప్పుడు, ఎన్నో సంవత్సరాల బంగారు భవిత కలిగిన యువత గనక మెల్లి మెల్లిగా అయినా సరే ఆత్మోద్ధరణకు పూనుకుంటే, వారి జీవితమే మారిపోతుంది.


Source: Akhand Jyoti Magazine 1962 (Hindi)



Comentários


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page