ఆత్మ విశ్వాసం అడుగంటితే
- Akhand Jyoti Magazine
- Sep 4, 2021
- 1 min read

ఆఫీసులో అతి పెద్ద పదవిలో ఉన్న బాబు దయనీయమైన స్థితిలో ఇంటికి రావడం చూచి భార్య
ఆందోళనగా అలా ఉన్నారేమని ప్రశ్నించింది. దారిలో ఒక దొంగ, నా కోటు, చెప్పులు, కళ్ళద్దాలు, పెన్ను, పర్సు అన్ని దోచుకున్నాడని చెప్పాడు. భార్య ఆశ్చర్యంతో మీ దగ్గర పిస్తోలు కూడా ఉన్నది కదా ఇలాంటి పరిస్థితి ఎందుకు సంభవించిందని అంటుంది. దానికి బాబు అదృష్టం బాగుంది. వాడి దృష్టి తుపాకి మీద పడలేదు. లేకుంటే అది వదిలేవాడు కాదని అన్నాడు.
మానవుని అంతఃకరణలో మహాశక్తి ఉన్నది. దాని పేరే ఆత్మ విశ్వాసం. సమర్దుడైన వ్యక్తి నుండి ఒక దొంగ తన ఆత్మవిశ్వాసంలో సర్వం దోచుకోగలిగినట్లే, వ్యక్తి తన ఆత్మవిశ్వాసంతో కోరుకున్నవన్నీ సాధించగలడు.
Source: - ప్రజ్ఞా పురాణం
*యుగశక్తి గాయత్రి - Oct 2010*
Opmerkingen