ఆత్మ ఆదేశాన్ని పాటించు
- Akhand Jyoti Magazine
- Jul 15, 2021
- 1 min read
మరణధర్మం కలిగిన ఓ మానవుడా! నిన్ను నీవు తెలుసుకో! ఎందుకంటే నీ లోపల, అందరి లోపల అద్వితీయమైన ఒకే ఆత్మ ఉంటుంది. అది బయట ప్రపంచ రంగస్థలంపై పలువిధాలుగా అభినయిస్తుంది. భగవంతుడు ఉన్నాడని నిరూపిస్తుంది. నీవు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నిజంగా కోరుకుంటే ఆత్మ పిలుపును శ్రద్ధగా విను. దానికి అనుగుణంగా పనిచెయ్యి . శుభము, సాత్వికము, దైవోచితము అయిన ప్రతి శక్తికీ పుట్టినిల్లు నీలోనే ఉంది. మనిషి తనలోని ఆత్మిక శక్తులను వికసింపచేసుకోవాలి. ప్రపంచంలోని అతి శ్రేష్ఠ వస్తువులన్నీ ఆ వికాసంలోనే ఇమిడి ఉన్నాయి. మనిషి తన ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నాడు అంటే అతని అభ్యున్నతి నిశ్చయం.
ప్రపంచంలో సఫల జీవితాన్ని కోరుకున్న ఆధ్యాత్మిక పురుషులు చేసిన మొదటి పని తమ అంతరాత్మను మేలుకొల్పడం. అంతఃకరణ ద్వారా శ్రద్ధగా వినడం వల్ల మనం భగదాజ్ఞను తెలుసుకోగలం,. అంతరాత్మ ఆజ్ఞను పాటించడం నేర్చుకుంటే పెద్ద పెద్ద ధార్మిక గ్రంథాలలో మునిగి పోవాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే బరువైన గ్రంథాలు కూడా అంతరాత్మను సద్వినియోగపరచడం వల్ల కలిగిన ఫలితాలే. అంతఃకరణ పిలుపులోని ఆదేశాలను పాటించడమే ప్రపంచంలోని మతాలన్నింటికీ మూలం.
అఖండజ్యోతి - ఏప్రిల్ 1954
యుగశక్తి గాయత్రి - ఆగస్టు 2018
Comments