top of page
Post: Blog2_Post

ఆవేశపడవద్దు

Updated: Jul 20, 2021

ఆపదకలిగినపుడు ప్రజలు దిగులు, శోకం, నిరాశ, భయం, గాబరా, క్రోధం, పిరికితనం వంటి విషాదకరమైన ఉద్వేగాలలో చిక్కు కుంటారు. సంపద లభించి నపుడు అహంకారం, మధం, మాత్సర్యం, అతిభోగం, ఈర్ష్య, ద్వేషం వంటి ఉద్రేకాలతో మునిగిపోతారు. ఈ ఉద్రేకాలు మనిషి అంతరిక స్థితిని ‌పిచ్చివాళ్ళ స్థితికి దిగజారుస్తాయి. ఇటువంటి స్థితి మనిషికి ఆపద, భయం హాని, అనర్థం, అశుభం తప్ప మరి వేటినీ ఇవ్వజాలదు.


*జీవితం ఒక ఉయ్యాలల దానిలో వెనుకకూ, ముందుకూ ఊపు ఉంటుంది. ఊగేవాడు ముందుకు వచ్చినపుడు, వెనుకకూ వెళ్లినపుడూ కూడా సంతోషంగా ఉంటాడు. నియంత్రణ లేని తృష్ణల ఎండమావులలో మనసు అతి దీనునివలె, నిరుపేదవలె, గర్భదరిద్రునివలె ఎల్లప్పుడూ వ్యాకులతతో నిండి ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న మనిషి ఎప్పుడూ దుఃఖితుడై ఉంటాడు. ఎందుకంటే ఊయలలో ఊగేవాడు ఆనందించిన విధంగా జీవితంలోని మంచి చెడుసంఘటనల యొక్క తీపి, చేదు రుచులను ఆనందంగా ఆస్వాదించడు. తన అదుపు లేని తృష్ణలకే ప్రాధాన్యం ఇస్తు ఉంటాడు. తన మనసుకు అనుకూలమైన విధంగానే అంతా జరగాలని కోరుతూ ఉంటాడు. అలా జరగటం సాధ్యపడదు కనుక తాను కోరుకున్న సుఖం లభించదు. ఇటువంటి దృష్టికోణం కలిగిన మనుషులు నిత్యం, అసంతృప్తితో, లేమితో దుఃఖంలో మునిగి ఉంటారు. వారు ప్రతి నిమిషం దురదృష్టవంతులమని భావిస్తు ఉంటారు.*

అఖండజ్యోతి, నవంబరు 1952

🙏🌲🌷🌾🪴🍂🌳🌺🌻💐🙏🏻

Recent Posts

See All
ఆత్మ ఆదేశాన్ని పాటించు

మరణధర్మం కలిగిన ఓ మానవుడా! నిన్ను నీవు తెలుసుకో! ఎందుకంటే నీ లోపల, అందరి లోపల అద్వితీయమైన ఒకే ఆత్మ ఉంటుంది. అది బయట ప్రపంచ రంగస్థలంపై...

 
 
 

Comentarios


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page